Janasena : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఆరు అంశాలు ప్రతిపాదించిన జనసేన

సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా - ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయుట.

Janasena : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం.. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఆరు అంశాలు ప్రతిపాదించిన జనసేన

Janasena proposed six points

Updated On : November 4, 2023 / 7:52 PM IST

Janasena Proposed Six Points Joint Manifesto : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇరువురు పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. చాలా రోజుల తరువాత హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు జైలు నుంచి వచ్చాక ఆయన్ను పవన్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో జరిగిన భేటీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఆరు అంశాలు ప్రతిపాదించారు. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా – ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేయుట.

AP Ministers : చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ : ఏపీ మంత్రులు

బీపీఎల్ కుటుంబాలు ఇళ్లు కట్టుకోవాలన్నా, లేక ఇళ్ల మరమ్మతులకు ఉచితంగా ఇసుక పంపిణీ, దాదాపు 30లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయూత ఇచ్చేలా కార్యాచరణ. సౌభాగ్య పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు చిరు వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునేలా రూ.10లక్షల చొప్పున సాయం అందించుట.

తద్వారా కొత్త ఉద్యోగాల కల్పన జరిగేలా ప్రణాళికలు. వ్యవసాయం – బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ఉద్యాన పంటలు పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు. మైనర్ ఇరిగేషన్ రంగాన్ని ప్రోత్సహించి వ్యవసాయ ఇబ్బందులు లేకుండా చూడటం.

Pawan Kalyan : చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం.. ఇరువురి భేటీకి రాజకీయ ప్రాధాన్యత

మన ఏపీ మన ఉద్యోగాలు పేరిట ప్రతీ ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టుల భర్తీ, ప్రయివేటు రంగంలో నూ ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు, సీపీఎస్ రద్దు చేసి పాత ఫించన్ విధానం అమలు అంశాలను ప్రతిపాదించిన జనసేన వంటి ఆరు అంశాలను పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు.