AP Ministers : చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ : ఏపీ మంత్రులు

చంద్రబాబు ఒక అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. అబద్దానికి, మోసానికి చెక్ పెట్టింది జగనే అని పేర్కొన్నారు.

AP Ministers : చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ : ఏపీ మంత్రులు

AP Ministers criticized Chandrababu

Updated On : November 4, 2023 / 7:13 PM IST

AP Ministers Criticized Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బ్రతకడానికి అవకాశం లేకుండా చంద్రబాబు పాలన చేశారని, అందుకే వారంతా కలిసి జగన్ ను ముఖ్యమంత్రిని చేశారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాష్ట్రం అంబేద్కర్ భావజాలంతో ముందుకెళ్తోందని, అందుకే జగన్ ను కాపాడుకోవాలన్నారు. గుంటూరు ఈస్ట్ లో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవినీతి చేసి దొరికి పోయిన చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు.

చంద్రబాబు అంటేనే మోసం : మంత్రి చెల్లుబోయిన
చంద్రబాబు ఒక అబద్దం.. చంద్రబాబు అంటేనే మోసం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శించారు. అబద్దానికి, మోసానికి చెక్ పెట్టింది జగనే అని పేర్కొన్నారు. పెద్దరికం పెద్ద రోగమని దానికి ఔషధం నవరత్నాలే అని జగన్ నమ్మారని తెలిపారు. రాజ్యాధికారం ఇచ్చిన వ్యక్తి జగనేనని స్పష్టం చేశారు. పది కులాల వారిని చంద్రబాబు మోసం చేశాడని విమర్శించారు.

చంద్రబాబు జడ్జి ముందు కూడా అబద్ధాలు చెప్పాడు : మంత్రి ఆదిమూలపు
చంద్రబాబు జడ్జి ముందు కూడా అబద్ధాలు చెప్పాడని తెలిపారు. మొన్న ఆసుపత్రిలో అడ్మిట్ అయి నిన్న డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంక్ గా వాడుకున్నారని తెలిపారు. రాజ్యసభ ఎంపీలు, లోక్ సభ ఎంపీలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఇచ్చారని వెల్లడించారు. అభినవ అంబేద్కర్, జ్యోతిబా పూలే జగన్ అని అభివర్ణించారు. ‘మీకు మంచి జరిగితేనే వైసీపీని ఆదరించండి జగన్ తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబుకి ఏపీలో చెప్పుకోవటానికి చిరునామా లేదు : ఎంపీ మోపిదేవి 
గరీబి హఠావో నినాదం నినాదంగానే ఉండిపోయిందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. జగన్ లక్ష్యం ఒక్కటేనని.. పేదలు పేదరికంలో ఉండకూడదన్నారు. అందుకే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పైకి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.

సంతలో పశువుల్లాగా రాజ్యసభ ఎంపీ పదవులను చంద్రబాబు అమ్ముకున్నారని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చేసిన అన్యాయం ఏంటో ప్రతిపక్ష నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి ఏపీలో చెప్పుకోవటానికి చిరునామా లేదని ఎద్దేవా చేశారు.

హామీలు అమలు చేస్తున్న సీఎం జగన్ : ఎమ్మెల్యే ముస్తాఫా
ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే ముస్తాఫా తెలిపారు. ఆశయం ఉన్న వ్యక్తి మంచి చేస్తాడని తెలుసన్నారు. తనను రెండు సార్లు గెలిపించారని వెల్లడించారు. అదే విధంగా తన కూతురు నూరి ఫాతిమాను కూడా ఆదరించాలని కోరారు.