Monsoon Tips : వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి చిట్కాలు !

రుతుపవనాలు అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా పిల్లలకు. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు ఇన్ఫెక్షన్ల సమస్యలు పెరుగుతాయి.

Monsoon Tips : వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి చిట్కాలు !

Monsoon Tips

Monsoon Tips : వర్షాకాలం ప్రారంభమైంది. పిల్లలు సురక్షితంగా ఉండటానికి, వర్షాల సీజన్ లో వారు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటానికి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవటం అవసరం. రుతుపవనాలు అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా పిల్లలకు. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు ఇన్ఫెక్షన్ల సమస్యలు పెరుగుతాయి. వర్షకాలంలో పిల్లలకు పరిశుభ్రత పద్ధతులు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాల్సిన అవరం ఉంది. వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన చిట్కాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Ice Cream : వర్షకాలంలో ఐస్ క్రీం తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?

రాబోయే వర్షాకాలం కోసం మీ పిల్లలను సిద్ధం చేయడానికి చిట్కాలు ;

1. వేయించిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్, రోడ్‌సైడ్ ఫుడ్, అలాగే పచ్చి, ఉడికించని ఆహారాన్ని నివారించాలి. పిల్లల కోసం పోషకమైన, సమతుల్య ఆహారాన్ని అందించాలి.
2. వర్షాకాలంలో పిల్లలకు శుద్ధి చేసిన తాగునీరు, మరగించి చల్లార్చిన నీరు తాగేలా చూసుకోండి
3. మలేరియా, డెంగ్యూ ఇతర వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి దోమల వృద్ధిని నివారించడానికి పరిసరాలను శుభ్రంగా ఉంచండి
4. ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి తడి బట్టలు, బూట్లు తప్పనిసరిగా ఆరుబయట ఆరబెట్టాలి
5. పిల్లలు భోజనానికి ముందు చేతులు బాగా కడుక్కునేలా ప్రోత్సహించండి.
6.స్కిప్పింగ్, హోపింగ్, టేబుల్ టెన్నిస్ మొదలైన ఇండోర్ ఫిజికల్ యాక్టివిటీస్ వంటి శారీరక శ్రమ కలిగించే క్రీడలను ప్రోత్సహించండి.

READ ALSO : Babies Vomit : పిల్లలు పాలుతాగిన వెంటనే వాంతి చేసుకుంటున్నారా! ఎందుకంటే?

7. సరైన దుస్తులు ధరించాలి. తేమను నిలుపుకునే దుస్తులను ఉపయోగించడం మానుకోండి.
8.శరీరంపై టాల్కమ్ పౌడర్ రాసుకోవాలి
9. వర్షాలు పడుతున్న సమయంలో రెయిన్‌కోట్‌లు, గొడుగులు, గమ్ బూట్లు ఉపయోగించండి.
10. ఆహారంలో తులసి, దాల్చిన చెక్క, నిమ్మ, అల్లం మరియు ఇతర మసాలా దినుసులు చేర్చండి. వీటిలో జ్వరాన్ని నివారించడంలో , ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడే చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.

READ ALSO : Fever Season : జ్వరాల కాలం వర్షకాలం! జాగ్రత్తలే రక్షణ

11. పిల్లవాడు అలెర్జీలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే, ఇన్ఫెక్షన్-కారణమైన సూక్ష్మక్రిమి పెరుగుదలకు కారణమైన తెమ్మతో కూడిన గోడలు, తివాచీలు, కర్టెన్‌లను పరిశీలించి వాటిని శుభ్రపరుచుకోవాలి.
12. అనారోగ్య వ్యక్తులతో, ముఖ్యంగా శరీర ద్రవాలతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటాన్ని నివారించాలి. ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, ఇన్ఫెక్షన్ కలిగించే జెర్మ్స్ వ్యాప్తిని తగ్గించడానికి కలుషితమైన ప్రదేశాలు, వస్తువులను శుభ్రం చేయాలి.

READ ALSO : Children Protect : వర్షాకాలంలో వ్యాధులనుండి పిల్లల రక్షణ ఎలాగంటే!..

13. పిల్లలను మానసికంగా ఉత్తేజపరిచేందుకు, ఇష్టపడే అభిరుచులలో పాల్గొనడాన్ని ప్రోత్సహించాలి.
14. మురికి నీటికి దూరంగా ఉండమని పిల్లలకు సూచించండి.
15. పిల్లలు బయటకు వెళ్లినప్పుడు పొడవాటి చేతుల దుస్తులు, పూర్తి పొడవు కలిగిన ప్యాంటులను వేసుకునేలా చూడండి. దోమలు కుట్టకుండా అవసరమైతే, దోమతెర ఉపయోగించండి.
16. పిల్లలను బయటి నుండి వచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో వారి పాదాలను కడగమని చెప్పండి. ప్లాస్టిక్, కాన్వాస్ లేదా లెదర్ బూట్లు ధరించడం మానుకోండి. సాధారణ చెప్పులు ధరించమని చెప్పండి. బూట్లు ధరించాల్సి వస్తే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు యాంటీ ఫంగల్ పౌడర్ రాయండి.