Uncultivable Lands : బంజరు భూముల్లో వృక్షాల పెంపకం.. ధీర్ఘకాలిక కలపతో అధిక ఆదాయం
ప్రస్తుతం వృదాగా ఉన్న బంజరు భూముల్లో టేకు, సుబాబుల్, జామాయిల్, మలబారు వేపలాంటి పంటలను వేసి ఆదాయాన్ని పొందుతున్నారు. ఎర్రచందనం, శ్రీగంధం లాంటి ధీర్ఘకాలిక పంటలను సాగుకు అన్ని ప్రాంతాలు అనువైనవి కావు.

Uncultivable Lands
Uncultivable Lands : ఏ ప్రాంతంలోనైనా సాగులో లేని చౌడు, రాతి, నీటి కోతకు గురయ్యే భూములను బంజరు భూములుగా పరిగణించవచ్చు. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 16 కోట్ల హెక్టార్లలో ఈ భూముల ఉన్నాయి. ఇలాంటి భూముల్లో నేల రకం, వాతావరణ పరిస్థిలులను బట్టి సరైన మొక్కలను ఎంచుకొని , సాంకేతిక యాజమాన్య పద్ధతులను పాటించినట్లైతే, ఆ భూముల్లో భూసారాన్ని పెంపొందించు కోవడమే కాకుండా కలప నుండి ఆదాయాన్ని కూడా పొందవచ్చు…
READ ALSO : Chandigarh : చికెన్ కర్రీలో బతికున్న పురుగు.. మూడేళ్లుగా సాగుతున్న కేసులో తాజాగా తీర్పు.. ఏంటంటే?
బంజరు భూముల్లో ఏపంటలు వేయాలో తెలియక చాలా వరకు రైతులు వదిలేస్తుంటారు. ఇలా వదిలేయడంతో భూములు నిస్సారంగా మారుతుంటాయి. ఇటు వంటి పరిస్థితుల్లో బంజరు భూముల్లో వృక్షాలు చేపడితే నిరూపయోగమైన క్షార భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చవచ్చు. అంతే కాకుండా వృక్షాలపై రైతులు ఆదాయం కూడా పొందవచ్చు.
READ ALSO : YS Jagan Mohan Reddy : జైల్లో చంద్రబాబు.. మరోసారి సీఎం అయ్యేందుకు జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి
ఇప్పటికే శాస్త్రవేత్తలు ఈభూముల్లో పెంచదగి చాలా రకాల వృక్షాలను అభివృద్ది చేశారు. ప్రస్తుతం వృదాగా ఉన్న బంజరు భూముల్లో టేకు, సుబాబుల్, జామాయిల్, మలబారు వేపలాంటి పంటలను వేసి ఆదాయాన్ని పొందుతున్నారు. ఎర్రచందనం, శ్రీగంధం లాంటి ధీర్ఘకాలిక పంటలను సాగుకు అన్ని ప్రాంతాలు అనువైనవి కావు. కొండలు గుట్టల్లో చల్లటి వాతావరణం ఉన్న ప్రాంతాలే వాటి సాగుకు అనుకూలం. అలాంటి వాతావరణం ఉంటేనే మొక్కల్లో క్వాలిటీ ఉండి ధర కూడా భాగా పలుకుతుంది.
READ ALSO : Work From Home : మంచంపై నుండే ఆఫీసు కార్యకలాపాలతో ఆరోగ్య సమస్యలు
ముఖ్యంగా హార్టికల్చర్ పంటలైన నేరెడు, ఉసిరి, చింత , సీతాఫలం , మామిడి లాంటి మొక్కలను కూడా నాటి ధీర్ఘకాలంగా ఆదాయాన్ని పొందవచ్చు. ఇటు చేనుచుట్లు వివిధ జాతుల అటవీ చెట్లను పెంచి కూడా ఆదాయం పొందవచ్చు. మాములుగా చేనుగట్ల మీద పొలం చుట్లు వెదురు, కానుగ, వేప, యూకలిప్టస్ , మలబారు, వేప, సరుగుడు, చింత,కొబ్బరి నాటుకొని దీర్ఘకాలంగా వాటి నుండి ఆదాయం పొందవచ్చు.
READ ALSO : Lack Of Sleep : నిద్రలేమి బరువు పెంచేలా చేస్తుందా?
మారుతున్న వాతావరణ పరిస్థితులకు వ్యవసాయం ఒక్కటే చేయడం కాకుండా వృదాగా పడిఉన్న భూముల్లో సైతం వృక్షాల పెంపకం చేపట్టి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. వీటికి సంబంధించిన మొక్కలను ఆయా ప్రాంతాల్లోన్ని అటవిశాఖ అధ్వర్యంలో పంపిణి చేయబడుతుంటాయి. అంతే కాకుండా కలపను అమ్ముకునేందుకు ఎంటాని నిబంధనలు లేవు కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలి.