Home » 10tv
అయితే వరుసగ కురిసిన వర్షాలకారణంగా అల్లం పంటలో నీరు నిలిచిపోవడంతో పిల్లోస్టిక్టా ఆకుమచ్చ తెగులు, దుంపకుళ్లు సోకింది. బరువైన నేలల్లో సాగుచేసిన ప్రాంతాల్లో వీటి ఉదృతి అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
నాట్లు వేయటానికి 15రోజుల ముందే పొలాన్ని రెండు మూడు దఫాలుగా మురగ దమ్ముచేయాలి. ఎత్తు పల్లాలు లేకుండా పొలమంతా సమానంగా వుండేటట్లు చదును చేయాలి. పొలంలో గట్లు వెడల్పులేకుండా సరిచేయాలి.
సాధారణంగా రైతులు 10 పిఎల్ పిల్లలను తీసుకొచ్చి పెంచుతుంటారు. అవినాణ్యమైనవా.. లేదా అని తెలుసుకునేందుకు ల్యాబ్ లలో పరీక్షలు సైతం చేయిస్తుంటారు. అయితే అవి చిన్నగా ఉండటం.. వాటిలోని నాణ్యత గుర్తించలేకపోతున్నారు.
రోజు రోజుకు తమలపాకు తోటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది. తెగుళ్లు, తుఫాను గాలుల వలన తీవ్ర నష్టాలు వస్తున్నాయి. వీటికి తోడు కూలీల కొరత.. రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటంతో రైతులు వీటి సాగుకు విముఖత చూపుతున్నారు.
ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిక వర్షాల వల్లన కోళ్లు అధిక ఒత్తిడికి గురవుతాయి. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్ళలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందినా.. చాలా వరకు పత్తిని విత్తారు . ప్రస్తుతం పత్తి 25 - 40 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురుస్తున్న అధిక వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి పోయింది.
మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సం�
జూలై నుండి ఆగస్టు నెలల్లో కొమ్మల కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యంతో పాటుగా అవసరానికి అనుగుణంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది.
పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు రైతులు . ప్రస్తుతం ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యం కావడంతో చాలా ప్రాంతాల్లో రైతులు పెసరను సాగుచేశారు. ఇటు కందిలో, పత్తిలో అంతర పంటగా కూడా వేశారు.
అయితే గతఏడాది మార్కెట్ లో పత్తికి అధిక ధర పలకడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం 20 నుండి 25 రోజుల దశలో పత్తి ఉంది. అయితే ఇటీవల కురుస్తున్న వరుస భారీ వర్షాలకు చాలా చోట్ల పంట దెబ్బతింది.