Pesara Farming :పెసరలో ఎర్రగొంగళి పురుగు బెడద.. నివారణకు చేపట్టాల్సిన చర్యలు

పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు రైతులు . ప్రస్తుతం ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యం కావడంతో చాలా ప్రాంతాల్లో రైతులు పెసరను సాగుచేశారు. ఇటు కందిలో, పత్తిలో అంతర పంటగా కూడా వేశారు.

Pesara Farming :పెసరలో ఎర్రగొంగళి పురుగు బెడద.. నివారణకు చేపట్టాల్సిన చర్యలు

Pesara Farming

Pesara Farming : ఖరీఫ్ లో తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతోపాటు  రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది . ప్రస్తుతం వర్షాధారంగా వేసిన పంట 20 రోజుల నుండి పూత, పిందె గట్టి పడే దశలో ఉంది. అయితే వరుసగా కురిసిన వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగు సమస్యగా మారింది  దీనిని సరైన సమయంలో నివారిస్తే మంచి దిగుబడులను సాధించ వచ్చంటున్నారు ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్  డా. జె.హేమంత్ కుమార్.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు రైతులు . ప్రస్తుతం ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యం కావడంతో చాలా ప్రాంతాల్లో రైతులు పెసరను సాగుచేశారు. ఇటు కందిలో, పత్తిలో అంతర పంటగా కూడా వేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో 20 రోజుల నుండి పూత, పిందె గట్టి పడే దశలో ఉంది.

READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు

ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపు 9 వేల హెక్టార్లలో ఈ పంటను సాగుచేశారు రైతులు. అయితే ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగు సమస్యగా మారింది. ఈ పురుగులు ఒక పొలం నుండి ఇంకో పొలానికి తిరుగుతూ  ఆ ప్రాంతంలో తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని గుర్తించన వెంటనే సమగ్ర యాజమాన్యం చేపడితే మంచి డిగుబడులను పొందవచ్చంటున్నారు  ఖమ్మం జిల్లా, వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్  డా. జె.హేమంత్ కుమార్.

READ ALSO : Yasangi Paddy Crop : యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి-నిరంజన్ రెడ్డి

ముఖ్యంగా ఎర్రగొంగళి పురుగుల నివారణకు లైట్ ట్రాప్స్ పెట్టుకుంటే చాలావరకు అరికట్టవచ్చు. అలాగే పొలం చుట్టు కందకాలు తీయడమే కాకుండా జిల్లేడు చెట్లను పెట్టుకున్నట్లైతే ఆ పురుగులు జిల్లెడు ఆకర్షిస్తాయి. దీంతో ఈ పురుగుల బెడదనుండి పంటను కాపాడుకోవచ్చు.