Pawan Kalyan: అప్పుడు, ఇప్పుడు.. అదే దూకుడు.. పవన్‌ కల్యాణ్ మాటిస్తే అంతే..!

తాను పర్యటించే కంటే ముందే అక్కడున్న ప్రాబ్లమ్స్..వాటి పరిష్కారానికి అయ్యే ఖర్చు, సాధ్యాసాధ్యాలపై స్టడీ చేసే వెళ్తున్నారట.

Pawan Kalyan: అప్పుడు, ఇప్పుడు.. అదే దూకుడు.. పవన్‌ కల్యాణ్ మాటిస్తే అంతే..!

Updated On : November 7, 2025 / 9:20 PM IST

Pawan Kalyan: వన్స్ హి స్టెప్‌ ఇన్.. పని అయిపోవాలంతే. చెప్పాడంటే చేస్తాడంతే. ప్రాబ్లమ్‌ సాల్వ్ కాదంటే ఫీల్డ్‌లోకి రాడు. అవసరమైతే ఆ ఇష్యూనే పట్టించుకోరు. ఒకసారి ఫోకస్ పెడితే మాత్రం..చకచకా పని అయిపోవాలి. సమస్యకు చెక్‌ పడాలి. ఇదీ డిప్యూటీ సీఎం పవన్ స్టైల్. అదే దూకుడు. అదే స్టైల్‌. కాకపోతే రోల్‌ చేంజ్. అప్పుడు పార్టీ అధినేత మాత్రమే. ఇప్పుడు పార్టీ బాస్..ఏపీ డిప్యూటీ సీఎం. అయినా అన్నింటిని బ్యాలెన్స్‌ చేస్తూ..ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే ట్రై చేస్తున్నారట సేనాని. పవన్ వర్కింగ్‌ స్టైల్ మారిందా? జెట్‌ స్పీడ్‌ వెనుక రీజనేంటి?

పవన్‌ కల్యాణ్. ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా ఆయన రూటే సెపరేటు. అపోజిషన్‌లో ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ తన దృష్టికి వచ్చిందంటే ఇమీడియేట్లీ అక్కడ వాలిపోయే వారు. ఇప్పుడు పవర్‌లో ఉండి..పైగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా అదే దూకుడు కంటిన్యూ చేస్తున్నారట. సమస్య ఏదైనా..ఇష్యూ ఎక్కడున్నా..ప్రాబ్లమ్‌ ఏంటో తెలుసుకుని పర్ఫెక్ట్‌ సెల్యూషన్‌ వెతుకుతున్నారట సేనాని. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలైనా..అవనిగడ్డ పర్యటనలో అయినా..గిరిజన ప్రాంతాల్లో కరెంట్ సప్లై అయినా..పంచాయితీ రాజ్‌ రోడ్ల విషయంలోనైనా..వన్స్ హి ఈజ్‌ ఫోకస్‌..పని అయిపోవాల్సిందంతే అన్నట్లుగా ప్రాబ్లమ్స్‌ సాల్వ్ చేస్తున్నారట.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిస్తూ..తాను మాటిస్తే పని జరిగిపోవాల్సిందేనన్న ఇండికేషన్స్ పంపుతున్నారట. వారం రోజుల క్రితం మొంథా తుఫాన్ బాధితుల పరామర్శకు కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించారు పవన్ కల్యాణ్. అప్పుడు అవనిగడ్డ ఎదురుమొండి దీవుల్లో జీవిస్తున్న ప్రజల సమస్యలు విన్న పవన్.. లేటెస్ట్‌గా ఏటిమొగ్గ, ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆర్డర్స్ ఇచ్చేశారు. అటవీ అనుమతుల ప్రాసెస్‌ను కూడా స్పీడప్ చేశారు.

ఎన్నికల హామీని నిలబెట్టుకునేలా కృషి..

ఇక ఏపీలో పంచాయతీరాజ్‌ రోడ్ల బాగుపై పవన్‌ స్పెషల్ ఫోకస్ పెట్టారట. కేంద్ర ప్రభుత్వ నిధులతో..గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల రూపు రేఖలను మార్చేస్తున్నారు. అవసరమైతే సాక్సీ స్కీమ్‌ కింద నిధులు సమకూర్చుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తూ..ప్రతీ గ్రామంలో రోడ్లు బాగు చేయాలని..నాణ్యతలో రాజీపడొద్దని డైరెక్షన్స్‌ ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మంచి రోడ్లు ఇస్తామని గుంతలు లేని రోడ్లను ఇక చూడరని కూటమి పెద్దలు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీని నిలబెట్టుకునేలా పవన్‌ పనిచేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

ఇక ఐదు నెలల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన పవన్..గిరిపుత్రులు దశాబ్దాల నాటి కలను సాకారం చేశారు. మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఆవాసాలతో ఉండే ఓ చిన్న గూడెం ప్రాంతానికి..9.6 కిలోమీటర్ల పొడవునా అడవులు, కొండల్లో రూ.80 లక్షలకు పైగా ఖర్చుతో విద్యుత్ లైన్లు వేసి కరెంట్‌ అందించారు. సోలార్ ప్యానళ్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రభుత్వం ఒక్కో ఇంటికీ ఐదు బల్బులు, ఒక ఫ్యాన్ కూడా అందించింది. దీంతో ఆ గూడెం ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.

గజరాజుల సమస్యకు ఏఐతో చెక్‌..

చిత్తూరుతో పాటు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో గజరాజుల సమస్యకు ఏఐతో చెక్‌ పెట్టే ప్లాన్‌ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు పవన్. ఏనుగులు.. ప్రజల ప్రాణాలు తీస్తుండటంతో పాటు వందల ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. గుంపులుగా గ్రామాలపై దాడి చేస్తున్న ఏనుగులను కంట్రోల్‌ చేయడం ప్రభుత్వాలకు సవాల్‌గా మారింది. కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదించి 4 శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకొచ్చారు. పెద్ద అటవీ ప్రాంతంలో నాలుగు ఏనుగులను తిప్పడం ఇబ్బందికరంగా మారిందట.

దీంతో డిప్యూటీ సీఎం పవన్ ఆల్టర్నేట్ ప్లాన్‌ ఇంప్లిమెంట్ చేశారు. ఏఐ టెక్నాలజీతో ఏనుగులను కంట్రోల్ చేసేలా చేశారు. ఏనుగులు గ్రామాల దగ్గరకు వస్తే గన్ ఫైరింగ్‌ శబ్దాలు చేయడం ద్వారా అవి వెనక్కి వెళ్లిపోతున్నాయి. సోలార్ ప్యానెళ్లతో పని చేస్తున్న ఈ ఏఐ టెక్నాలజీ అద్భుతంగా పనిచేస్తోందని ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఇలా సమస్యల విషయంలో పవన్ చూపుతున్న చొరవ చర్చనీయాంశంగా మారింది. సాల్వ్‌ అవుతాయన్న సమస్యలపైనే సీరియస్‌గా ఫోకస్ పెడుతున్నారట పవన్. తాను పర్యటించే కంటే ముందే అక్కడున్న ప్రాబ్లమ్స్..వాటి పరిష్కారానికి అయ్యే ఖర్చు, సాధ్యాసాధ్యాలపై స్టడీ చేసే వెళ్తున్నారట. ఒకవేళ సమస్యలను పరిష్కరించే అవకాశం లేకపోవడంతో..అసలు ఆ ఇష్యూలను పట్టించుకోవడం లేదట. హామీ ఇచ్చి మాట తప్పారన్న పేరు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట పవన్. ఏదైనా పవన్‌ అప్పుడు..ఇప్పుడు అదే రూట్‌ను ఫాలో అవుతున్నారని చర్చించుకున్నారు జనం.

Also Read: జగన్ ముందు మరో సవాల్‌..! ఆ విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి? ఎన్డీయే సర్కార్‌కు మద్దతిస్తుందా?