Hydraa: జూబ్లీహిల్స్‌లో కీలక ప్రచార అస్త్రంగా హైడ్రా.. ఎవరికి ప్లస్? బాధితుల ఓట్లు ఏ పార్టీకి?
ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో హైడ్రా హాట్ టాపిక్ అయింది. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు హైడ్రా కూల్చివేతలపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి.
Hydraa: బైపోల్ రాజకీయం రంజుగా మారింది. ఓటింగ్‌కు ఇంకా మూడ్రోజుల టైమ్ మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ..క్లైమాక్స్‌లో ప్రతీ చిన్న అంశాన్ని హైలెట్ చేస్తున్నాయి పార్టీలు. ఇక బైపోల్ వార్ మొదలైనప్పటి నుంచి జూబ్లీహిల్స్ పాలిటిక్స్ మొత్తం హైడ్రా చుట్టూ తిరుగుతున్నాయి. పెద్దలను కాపాడి..పేదల ఇళ్లను కూల్చారన్న ఎజెండాతో బీఆర్ఎస్ ..నగరంలో చెరువులను కాపాడామని చెప్పుకుంటూ కాంగ్రెస్ ముందుకెళ్తున్నాయి. అసలు జూబ్లీహిల్స్‌లో హైడ్రా ఎఫెక్ట్ ఎంత? హైడ్రా బాధితుల ఓట్లు ఎవరివైపు.?
ఒకే ఒక ఉప ఎన్నిక. పైగా గ్రేటర్ హైదరాబాద్ లో జరుగుతున్న బైపోల్. ప్రతీ అంశం ఇంపార్టెంటే. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకపోడమే వ్యూహం. ఇదే లైన్ లో ముందుకు వెళ్తున్నాయి పార్టీలు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ లో హైడ్రా అతిపెద్ద అంశంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో హైడ్రాతో హైదరాబాద్ ప్రైడ్ నాశనం.. రియల్ ఎస్టేట్ కుదేలు అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్. కేటీఆర్ అయితే హైడ్రా అంశాన్ని తన ప్రచార అస్ర్తంగా మార్చుకున్నారు.
గ్రేటర్ ప్రజల అసహనానికి కారణమైన హైడ్రాపై ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది కారు పార్టీ. జూబ్లీహిల్స్ వీధుల్లో, సమావేశ వేదికలపై భారీ ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టి, హైడ్రా కూల్చివేతలతో ఇళ్లు కోల్పోయిన కుటుంబాల వీడియోలు ప్రదర్శిస్తున్నారు. తమ ఇళ్లు కోల్పోయామని బాధపడుతున్న వారి కన్నీటి గాధలు, పిల్లల కేకలు, వృద్ధుల నిరాశలను కేటీఆర్ తన ప్రచారంలో ఎక్స్పోజ్ చేస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలకు హైడ్రా ఓ ఎగ్జాంపుల్ అని చెప్తోంది బీఆర్ఎస్. కారు గుర్తుకు ఓటు వేయడం అంటే కేవలం BRSకు మద్దతు కాదు..అన్యాయానికి వ్యతిరేకంగా ఓ నిరసన అని కేటీఆర్ చెబుతున్నారు.
ప్రజల హృదయాన్ని తాకే ఆయుధంగా హైడ్రా వాడకం..
హైడ్రాతో ఇళ్లు కోల్పోయిన వారిని ఇప్పుడు కేటీఆర్ ప్రచార వేదికలపై నిలబెట్టడం ఓ పొలిటికల్ స్ట్రాటజీగా చెప్తున్నారు. తెలంగాణ భవన్ లో హైడ్రా బాధితులతో సమావేశం పెట్టి..వారి కన్నీటి బాధను తెలియజేసేలా చేశారు కేటీఆర్. హైడ్రా అంశం బీఆర్ఎస్ కు ఎంతవరకు ఫలిస్తుందో లేదో కానీ..కేటీఆర్ ప్రచారానికి మాత్రం కొత్త హైప్ తీసుకొస్తోంది. హైడ్రా ఒక ప్రచార అస్త్రమే కాకుండా..ప్రజల హృదయాన్ని తాకే ఆయుధంగా వాడుతున్నారు కేటీఆర్.
ధనవంతుల అక్రమ నిర్మాణాలపై హైడ్రా యాక్షన్ తీసుకోవడం లేదని, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లే కూల్చివేస్తుందని ఎక్స్పోజ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు FTL పరిధిలో ఉన్నా, మంత్రుల ఫాంహౌజ్ లు బఫర్ జోన్ లో ఉన్నా ఎందుకు కూల్చడం లేదో చెప్పాలంటున్నారు. బుల్డోజర్ రావాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి. మీ ఇళ్లను, మీ వ్యాపారాలను కాపాడుకోవాలంటే కారును గెలిపించండి అంటూ జూబ్లీహిల్స్ ఓటర్లకు పిలుపునిస్తున్నారు.
ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో హైడ్రా హాట్ టాపిక్ అయింది. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు హైడ్రా కూల్చివేతలపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా బుల్డోజర్ కావాలా? కారు కావాలా? అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్. విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జాల నుంచి కాపాడామని చెప్పుకుంటుంది. వందల కోట్ల విలువైన భూములు కబ్జా అయితే కాపాడామని చెబుతోంది అధికార పార్టీ.
హైడ్రాకు అనుకూలంగా ర్యాలీలు, సభలు..
ఉప ఎన్నికల ప్రచారంలో ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ విమర్శలు చేస్తుండటంతో..హైడ్రాకు అనుకూలంగా కొన్ని చోట్ల ర్యాలీలు, సభలు జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. పార్కుల కబ్జాలు తొలగించిన ప్రాంతాల్లోని స్థానికులు..చెరువులను అభివృద్ధి చేసిన ఏరియాల్లోని జనం హైడ్రాకు అనుకూలంగా ర్యాలీలు చేస్తున్నారు. హైడ్రానే వారి వెనుకుండి ర్యాలీలు చేయిస్తున్నట్లు బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో హైడ్రా బాధితులు, హైడ్రాను తప్పుబడుతున్న జనం..జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిజంగా బీఆర్ఎస్ వైపు నిలుస్తారా…ఇది ప్రచారాస్త్రంగా కారు పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుందన్నది చూడాలి.
Also Read: జూబ్లీహిల్స్ బైపోల్… సీఎం రేవంత్ ట్రయాంగిల్ స్కెచ్..! ఆ ప్రచారం వెనుక పెద్ద ప్లానే ఉందా?
