Cm Revanth Reddy: జూబ్లీహిల్స్ బైపోల్… సీఎం రేవంత్ ట్రయాంగిల్ స్కెచ్..! ఆ ప్రచారం వెనుక పెద్ద ప్లానే ఉందా?

సర్వేలన్నీ బీఆర్ఎస్‌వైపే మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌ కూడా కాంగ్రెస్‌కు పాజిటివ్‌గా లేదన్న టాక్ వినిపిస్తోంది.

Cm Revanth Reddy: జూబ్లీహిల్స్ బైపోల్… సీఎం రేవంత్ ట్రయాంగిల్ స్కెచ్..! ఆ ప్రచారం వెనుక పెద్ద ప్లానే ఉందా?

Updated On : November 7, 2025 / 8:44 PM IST

Cm Revanth Reddy: ఎలక్షన్‌ అంటేనే వ్యూహం. పైగా ఇది బైపోల్. గెలిచామా? ఓడామా? అన్నదే లెక్క. పైగా ఈ ఎన్నిక పాలిటిక్స్‌నే మార్చేస్తుందన్న అంచనాలున్నాయి. అందుకే అందరూ సీరియస్‌గా కాన్సంట్రేషన్ పెట్టారు. సీఎం రేవంత్ అయితే అన్నీ తానై ప్రచారంలో మాటల తూటాలు పేలుస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రచారంలో రేవంత్‌ మైండ్‌ గేమ్‌ స్టార్ట్ చేశారా? బీజేపీని ఉసిగొల్పి..కారు స్పీడును కంట్రోల్‌ చేసే స్కెచ్ వేస్తున్నారా? కారు, క‌మ‌లం ఒకటేనన్న ప్రచారం వెనుక పెద్ద ప్లానే ఉందా? రేవంత్ హైవోల్టేజ్ అటాక్ వర్కౌట్ అయ్యేనా?

జూబ్లీహిల్స్‌ బైపోల్ ప్రచారం హోరెత్తుతోంది. సీఎం రేవంత్‌ రెడ్డి వరుస రోడ్ షోలతో..టాప్ గేర్‌లో ప్రత్యర్థుల‌ను టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ అటాక్ మోడ్‌లో వెళ్తున్న రేవంత్ ప్రచార సరళి ఆసక్తికరంగా మారింది. క్యాంపెయిన్‌లో మొదటి రెండ్రోజులు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి మీదే మాట్లాడిన రేవంత్..నెక్స్ట్‌ డే నుంచి స్పీచ్‌ను మార్చేశారు. బీఆర్ఎస్-బీజేపీల‌పైనే బాణాలు ఎక్కుపెడుతున్నారు.

పదేపదే బీజేపీని విమర్శిస్తుండటం వెనుక పెద్ద ప్లాన్..!

అయితే సర్వేలన్నీ బీఆర్ఎస్‌వైపే మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌ కూడా కాంగ్రెస్‌కు పాజిటివ్‌గా లేదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో కారు స్పీడును కంట్రోల్ చేసేందుకు..తన విమర్శల దాడితో రేవంత్‌ బీజేపీని లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చారన్న గుసగుసలు మొదలయ్యాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారంతో కీల‌క ఓటు బ్యాంక్‌గా ఉన్న ముస్లిం, మైనార్టీల ఓట్లు స్ప్లిట్‌ కాకుండా..మాస్టర్‌ స్కెచ్‌ వేశారట రేవంత్. ముస్లిం, మైనార్టీ ఓట్లు సాలిడ్‌గా కాంగ్రెస్‌ వైపునకు మళ్లేలా..బీజేపీకి హైప్ ఇస్తున్నారన్న చర్చ లేకపోలేదు. అసలు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఫైట్‌ ఉందని సర్వే సంస్థలు..ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు చెబుతుండగా..రేవంత్‌ మాత్రం పదేపదే బీజేపీని విమర్శిస్తుండటం వెనుక పెద్ద ప్లానే ఉందన్న చర్చ మొదలైంది.

బీజేపీకి డిపాజిట్‌ కూడా రాదని..బీఆర్ఎస్‌తో కుమ్మక్కు అయ్యిందని చెప్పుకొస్తున్నారు రేవంత్. కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్‌ రేసులో యాక్షన్‌ తీసుకోవడం లేదని..రకరకాల అంశాలపై తెరమీదకు తెస్తూ..స్కెచ్‌ వేసి మరీ..రేవంత్‌ కమలం పార్టీని ప్రచారానికి ఉసిగొల్పారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్‌ విమర్శల దాడి తర్వాతే..కిషన్‌రెడ్డి రియాక్ట్ అవడం..బండి సంజయ్‌ ప్రచార బరిలోకి దిగారని..ఇవన్నీ సీఎం పొలిటికల్ స్కెచ్‌లో భాగమేనని చర్చించుకుంటున్నారు.

మైనార్టీల్లో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ను పెంచేలా స్కెచ్..!

కాళేశ్వం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెల‌లు అవుతున్నా..కేసీఆర్, హ‌రీశ్‌రావుల‌ను ఎందుకు విచారించ‌డం లేదో చెప్పాల‌ని కేంద్రమంత్రి కిష‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు రేవంత్. అంతేకాదు ఈ-కార్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు గ‌వ‌ర్నర్ అనుమ‌తి కోరినా ఆమోదం రాలేద‌ని..అందుకు బీజేపీ-బీఆర్ఎస్ దోస్తే కార‌ణమంటున్నారు రేవంత్. కారుకు ఓటేస్తే..క‌మ‌లంకు ఓటేసిన‌ట్లే అన్న వాద‌న‌ను బ‌లంగా మైనార్టీల్లోకి తీసుకెళ్లాలన్నదే రేవంత్ వ్యూహమట. దీంతో ఇప్పటివ‌ర‌కు బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న మైనార్టీ ఓటు బ్యాంకును కూడా కాంగ్రెస్‌కు మ‌ళ్లిస్తే తమ గెలుపు ఈజీ అయిపోతుందనేది సీఎం ప్లాన్‌గా చెబతున్నారు. మైనార్టీల్లో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ను పెంచుకునేందుకే రేవంత్ అటాకింగ్‌ మోడ్‌లో వెళ్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఇక జూబ్లీహిల్స్ అభివృద్దిని ఎజెండాను రేవంత్ వ్యూహాత్మకంగానే తెర‌మీద‌కు తెస్తున్నార‌ట‌. ప‌దేళ్ల కాలంలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌కు ఏం చేయలేదంటూనే..పక్కనే ఉన్న కంటోన్మెంట్ అభివృద్దికి తాము 20 నెలల్లో రూ.5 వేల కోట్ల నిధులు ఇచ్చినట్లు కేటీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్. ఇక మాగంటి మరణం..సునీతమ్మ పోటీ అంటూ బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతుంటే..గ‌తంలో పీజేఆర్ మ‌ర‌ణిస్తే..కేసీఆర్ పోటీకి పెట్టిన అంశాన్ని ప్రస్తావిస్తూ కారును కార్నర్ చేస్తున్నారు సీఎం. ఈ స్ట్రాటజీతో పీజేఆర్ గ్లామ‌ర్‌ కాంగ్రెస్‌తోనే కంటిన్యూ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇలా ఫైట్‌ బెట్‌ విన్‌ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా ఉన్న జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో..ఓట్ల చీలిక జరగాలన్నది రేవంత్‌ వ్యూహమంటున్నారు. బీజేపీ ప్రచారంలో స్పీడు పెంచితే..ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి తమకు అడ్వాంటేజ్‌గా మారుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. సేమ్‌టైమ్‌ బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారంతో మైనార్టీ ఓటర్లను కారు పార్టీ నుంచి దూరం చేయాలన్నది మరో స్కెచ్‌ అని చెప్పుకుంటున్నారు. ఇక మహిళలు సెంటిమెంట్‌కు అండగా ఉండకుండా..పీజేఆర్‌ పేరును ప్రస్తావిస్తున్నారట. ఇలా ట్రయాంగిల్‌ వ్యూహాలతో రేవంత్ జూబ్లీహిల్స్‌ బైపోల్‌ గేమ్‌ ఆడుతున్నారన్న చర్చ జరుగుతోంది. సీఎం మాస్టర్ స్కెచ్‌ ఎంత వరకు వ‌ర్కౌట్ అవుతుందో చూడాలి.

Also Read: ఆ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. హైదరాబాద్‎కు కేటీఆర్‌ తెచ్చింది ఇదే- సీఎం రేవంత్ రెడ్డి