Cm Revanth Reddy: ఆ ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. హైదరాబాద్కు కేటీఆర్ తెచ్చింది ఇదే- సీఎం రేవంత్ రెడ్డి
ఎల్ అండ్ టీ నుంచి కేసీఆర్, కేటీఆర్ డబ్బులు వసూలు చేసుకున్నారు. ఎల్ అండ్ టీ మునగడానికి కారణం కేసీఆర్, కేటీఆర్ కాదా?
Cm Revanth Reddy: తెలంగాణలో అభివృద్ధి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ లపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధం అన్నారు. ఫ్లైఓవర్ అనే విధానాన్ని కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. వచ్చే పదేళ్ల కోసం తాము భవిష్యత్ ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని బ్యాడ్ బ్రదర్స్ కేటీఆర్, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
”జూబ్లీహిల్స్ ఓటర్లు విజ్ఞతతో ఓటేయాలి. గత 20ఏళ్ల అభివృద్ధిని పోల్చి ఓటేయాలి. ఎల్ అండ్ టీ నుంచి కేసీఆర్, కేటీఆర్ డబ్బులు వసూలు చేసుకున్నారు. ఎల్ అండ్ టీ మునగడానికి కారణం కేసీఆర్, కేటీఆర్ కాదా? హైదరాబాద్ ను డ్రగ్స్ కు అడ్డాగా మార్చింది కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత సన్నిహితుడు డ్రగ్స్ ఓవర్ డోస్ తో చనిపోలేదా? కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో కొకైన్ తో సన్నిహితుడు దొరకలేదా? కాంగ్రెస్ కట్టిన ఓఆర్ఆర్ ను పల్లి బఠాణీలకు అమ్మేసుకుని వెళ్లారు” అని నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Also Read: ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన
”ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళనను బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చీడ పురుగుల్లా తయారయ్యారు. ఏడాదిన్నర లోపే రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. మేము గెలిచిన తర్వాతనే కంటోన్మెంట్ అభివృద్ధి ప్రారంభమైంది. ఎన్నో జీసీసీ కంపెనీలను హైదరాబాద్ కు తీసుకొచ్చాం. కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికైనా సాగునీళ్లు అందాయా? కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉపయోగపడింది. జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ గెలవాల్సిందే. 2025 వరకు గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మా ప్రభుత్వం వచ్చాక గ్రూప్1 నుంచి గ్రూప్ 4 వరకు ఉద్యోగాలు ఇచ్చాం.
గుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా, ఢిల్లీలో యుమన ప్రక్షాళన జరగొచ్చు.. హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన జరగొద్దా? యూపీ, ఢిల్లీ, గుజరాత్ లో నదుల ప్రక్షాళనకు కేంద్రం నిధులు ఇస్తోంది. హైదరాబాద్ లోని మూసీ ప్రక్షాళనకు నిధులివ్వరా? కేటీఆర్ ఒక చీడ పురుగు.. కిషన్ రెడ్డి ఎందుకు సహకరిస్తున్నారు? హైదరాబాద్ ను డ్రగ్స్ కేంద్రంగా మార్చారు కేటీఆర్. హైదరాబాద్ పై విషం చిమ్ముతున్నారు. 44 చెరువులను బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు. పార్క్ లు, నాళాలు, చెరువులు కబ్జా కావాలి.. హైదరాబాద్ మునగాలా?” అంటూ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.
