Redmi Note 14 Pro Plus : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీగా తగ్గిన రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Redmi Note 14 Pro Plus : కొత్త రెడ్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? భారీ తగ్గింపు ధరకే రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ కొనేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెడ్‌మి ఫోన్ ఎంతంటే?

Redmi Note 14 Pro Plus : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీగా తగ్గిన రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Redmi Note 14 Pro Plus

Updated On : November 7, 2025 / 7:29 PM IST

Redmi Note 14 Pro Plus : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? పర్ఫెక్ట్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ రూ.7వేల కన్నా భారీ తగ్గింపుతో లభ్యమవుతుంది.

బ్యాంక్ ఆఫర్ల తర్వాత రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ట్రిపుల్ కెమెరా (Redmi Note 14 Pro Plus) సెటప్‌తో పాటు అమోల్డ్ ప్యానెల్ మెరుగైన మన్నిక కోసం IP66 + IP68 + IP69 అందిస్తుంది. మీకు ఆసక్తిగా ఉంటే..ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర :
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ ధర రూ.30,999 నుంచి రూ.24,584కు తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ కార్డ్ వంటి కొన్ని బ్యాంక్ కార్డుల ద్వారా కస్టమర్లు అదనంగా సేవ్ చేసుకోవచ్చు. తద్వారా ధర రూ.23,210కి తగ్గుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు నెలకు రూ.865 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.

మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. రూ. 24వేల వరకు వాల్యూను పొందవచ్చు. అయితే, మీ ఫోన్ వర్కింగ్ కండిషన్లపై ఆధారపడి ఉంటుంది. మీరు అదనంగా చెల్లించడం ద్వారా ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇతర యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.

Read Also : Honda Activa 125 : ఇది కదా ఆఫర్ మామ.. హోండా యాక్టివా 125పై బిగ్ డిస్కౌంట్.. ఫీచర్లు, మైలేజీ కోసమైనా ఈ స్కూటర్ కొనేసుకోవచ్చు..!

రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ 6.67-అంగుళాల 1.5K ఓఎల్ఈడీ ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ప్యానెల్‌ను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ రెడ్‌మి ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ద్వారా పవర్ పొందుతుంది.

12GB ర్యామ్, 512GB స్టోరేజీ కలిగి ఉంది. 6,200mAh బ్యాటరీ 90W ఛార్జింగ్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీ పరంగా ఈ రెడ్‌మి ఫోన్ 50MP మెయిన్, 8MP అల్ట్రావైడ్ 50MP టెలిఫోటో కెమెరాను అందిస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే 20MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.