Erragadda: ఎర్రగడ్డలో కలకలం.. ఓ ఇంట్లో భారీగా డబ్బు? పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు..

సమాచారం అందుకున్న ప్లయింగ్ స్క్వాడ్ వెంటనే స్పాట్ కి చేరుకుంది.

Erragadda: ఎర్రగడ్డలో కలకలం.. ఓ ఇంట్లో భారీగా డబ్బు? పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు..

Updated On : November 8, 2025 / 12:22 AM IST

Erragadda: హైదరాబాద్ ఎర్రగడ్డలో కలకలం రేగింది. ఓ ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బుని సిద్ధం చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ప్లయింగ్ స్క్వాడ్ వెంటనే స్పాట్ కి చేరుకుంది. ఆ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. ఆ ఇంటి వద్దకు భారీగా పోలీసులు కూడా చేరుకున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఓ ఇంట్లో భారీగా డబ్బు ఉందనే వార్త సంచలనంగా మారింది. ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ లోని ఓ ఇంట్లో భారీగా నగదు ఉంది, ఆ డబ్బుని ఓటర్లకు పంపిణీ చేసేందుకే తీసుకొచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్థానికులు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఎలక్షన్ కమిషన్ ఫ్లైయింగ్ స్వ్కాడ్ రంగంలోకి దిగింది. వారితో పాటుగా పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఆ ఇంట్లో డబ్బు ఉన్నది లేనిది దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

శుక్రవారం ఉదయం కూడా బీఆర్ఎస్ నేతలు (రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్) ఇళ్లలో రైడ్స్ జరిగాయి.

Also Read: జూబ్లీహిల్స్ బైపోల్… సీఎం రేవంత్ ట్రయాంగిల్ స్కెచ్..! ఆ ప్రచారం వెనుక పెద్ద ప్లానే ఉందా?