Home » Addanki Dayakar Says Sorry To Komatireddy
తెలంగాణ కాంగ్రెస్లో మునుగోడు ముసలం కొనసాగుతూనే ఉంది. రేవంత్ సారీ చెప్పినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనక్కు తగ్గలేదు. తనపై పరుష పదజాలంతో మాట్లాడిన అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాతనే తాను ఏదైనా మాట్లాడతానని అన్నారు.
ఏదో ఆవేశంలో నోరు జారి అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. వెంకట్ రెడ్డికి వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నట్లు దయాకర్ తెలిపారు. తన వ్యాఖ్యల పట్ల బాధ పడుతున్న కోమటిరెడ్డి అభిమానులు తనను క్షమించాలని ఆయన కోరారు.