పోలీసులమని చెప్పి బెదిరించి, అక్రమ మద్యం వ్యాపారస్థుడి నుండి 50 మద్యం సీసాలు, ఏడు వేల రూపాయల నగదును స్వాహా చేసిన ఐదుగురు నకిలీ పోలీసులను కృష్ణాజిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ.. ఆంధ్రా సరిహద్దులలో అంబులెన్సుల అనుమతిపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ ఆసుపత్రిలో బెడ్ రిజర్వ్ ఉంటేనే సరిహద్దులో ఏపీ నుండి వచ్చే అంబులెన్సులకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌పై రాష్ట్ర ఉన్నత న్�
కరోనా వేళ రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం ప్రాణాలను బలితీసుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా కట్టడి చర్యలలో భాగంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సరిహద్దుల వద్ద ప్రజలను నిలిపివేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయలోపం ప్రజల ప్రాణాల మీదకి తెస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు కరోనా రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద అడ్డుకుంటున్నారు.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీ పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయకపోయినా మధ్యాహ్నం 12 గంటల నుండి పలు జిల్లాలో తీవ్ర ఆంక్షలు కొనసాగుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. రోజుకి వేల సంఖ్యలో మహమ్మారి బారిన పడడంతో ఆసుపత్రులలో సౌకర్యాల కొరత తీవ్రంగా మారింది. ఇటు మందులు, ఆక్సిజన్ కొరతతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి.