Home » ayyappa nagar
విజయవాడ అయ్యప్పనగర్ లో సైకో కలకలం రేగింది. ఓ వ్యక్తి అర్థరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి మహిళల పక్కన నిద్రపోతున్నాడనే వార్తలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. అర్థరాత్రి అయితే చాలు మహిళలు భయంగా గడుపుతున్నారు.
అర్థరాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయం. మిగిలిన ప్రపంచంలానే ఆ ప్రాంత మహిళలు ఆ సమయంలో గాఢనిద్రలో మునిగి ఉంటారు. అన్నీ మరిచి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో వారికి హఠాత్తుగా మెలకువ వస్తుంది. చూస్తే పక్కనే ఓ అపరిచిత వ్యక్తి పడుకుని ఉంటాడు.