Home » Banana plantation spacing
ఎకరాకు కనీసంగా 30టన్నుల దిగుబడి వచ్చే విధంగా ఈ తోట వుంది. ఇటీవలికాలంలో వ్యాపారులు అరటిని గెలతోపాటు కాకుండా తోటవద్దే గెలనుంచి హాస్తాలను వేరుచేసి కిలోల చొప్పున కొనుగోలుచేస్తున్నారు. దీనివల్ల రవాణాలో అరటి పాడయ్యే అవకాశం వుండదు.
అరటి తోటల సాగుకు ఏడాది పొడవునా అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే ఏప్రెల్ ఆగష్టు మాసాల మధ్య నాటటం వల్ల సాగులో సమస్యలు తక్కువగా వుండి, దిగుబడలు ఆశాజనకంగా వుంటున్నాయి. సాధారణంగా తల్లిమొక్కల నుండి పిలకలను సేకరించి, నాటే విధానం ఎప్పటినుంచో ఆచరణలో
పిలకల దుంపలకు ఏమైనా దెబ్బ తగిలినచో ఆ భాగాన్ని తీసి వేసి నాటాలి. పిలక మొక్కపై భాగంను నరికి పాతినట్లైతే అవి త్వరగా నాటుకొని బాగా పెరుగుతాయి. పిలకలను నాటే ముందు 1% బావిస్టన్ ద్రావణంతో 5 నిమిషాలు ఉంచాలి.