Home » Basaveshwara and Sangameshwara lift Schemes
మంజీరా నది గోదావరిలో కలవడం ప్రకృతి సహజం పేర్కొన్నారు. గోదావరిని మంజీరాలో కలపడం అద్భుతమన్నారు. సీఎం ఎక్కడ అడుగుపెడితే అక్కడ సస్యశ్యామలం అయిందని తెలిపారు.
దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గుడుపుకునే దందా జరుగుతోందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.
బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
విదేశాల్లో చదువుకునే పేద పిల్లలకు రూ.20 లక్షల స్కాలర్ షిప్ ఇస్తున్న ఏకైకా రాష్ట్రం మనదేనని తెలిపారు. ఆరేడు ఏళ్లలో తెలంగాణ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగిందో మీ అందరికీ తెలుసన్నారు.