Home » bhagini hastha bhojanam
ఐదు రోజుల పండుగ దీపావళి పండుగలో ఆసక్తికరమైన పండుగ ‘భగినీ హస్త భోజనం‘. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల పండుగ అంటే గుర్తుకొచ్చేది రక్షా బంధన్ పండుగ. అంతటి ప్రాముఖ్యత కలిగినది కార్తీకమాసంలో వచ్చే దీపావళి పండుగలో భాగమైన భగినీ హస్త భోజనం పండుగ.
కార్తీక శుద్ధ విదియను భక్తులు విలక్షణ పర్వదినంగా భావిస్తారు. దీపావళి వెళ్లిన రెండు రోజులకు వచ్చే విదియ నాడు భగినీ హస్త భోజనం జరుపుకుంటారు.
దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. అశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ద విదియ ‘భగినీహస్త భోజనం’తో ముగుస్తాయి. దీంట్లో భగినీ హస్త భోజనానికి చాలా విశిష్టత ఉంది. భగినీ అంటే సోదరి. ఆమె చేతితో స్వయంగా వడ్డి�