Home » carrot juice
శరీరంలో కొవ్వు కరిగేందుకు క్యారెట్ జ్యూస్ ఉపకరిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. కంటి చూపు మెరుగవ్వటంతోపాటు, చర్మ సంబంధిత అనారోగ్యాలు తొలగిపోతాయి. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
కొద్ది మొత్తంలొ క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి, టైప్ 2 డయాబెటిస్ ఉన్న ఎలుకలలో చేసిన అధ్యయనాలు పులియబెట్టిన క్యారెట్ రసం రక్తంలో చక్కెరను తగ్గిస్తుందని కనుగొన్నారు.
క్యారెట్‌ను రోజు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది. క్యారెట్లో ఉండే ఫాల్కరినల్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్‌పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది.
ఇక అధిక బరువుతోపాటు, పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ ను కరిగించుకునేందుకు క్యారెట్ జ్యూమ్ బాగా పనిచేస్తుంది. క్యారెట్లలో విటమిన్లు బి1, బి2, బి6లు అధికంగా ఉంటాయి.