Home » Castor cultivation
Kharif Castor Cultivation : నూనెగింజల పంటల్లో ఆముదానిది ప్రత్యేకస్థానం. బీడు, బంజరు భూముల్లో సైతం రైతులు ఆముదాన్ని సాగుచేసి, ఆశాజనకమైన రాబడిని సొంతం చేసుకుంటున్నారు.
సబ్బులు, డిటర్జంట్లు వంటి వాటిల్లో కూడా వాడుతుండడంతో దేశంలో ఆముదం పంటకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారత దేశానికి ఏటా 5వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించటం విశేషం.
గతంలో దిగుబడులు తక్కువగా వుండి, ఆదాయం నిరాశాజనకంగా వుండటంతో... ఇతర పంటల సాగుకు మొగ్గిన రైతాంగం.. అధిక దిగుబడులిచ్చే అనేక సంకర రకాలు మార్కెట్ లో అందుబాటులో ఉండటంతో మళ్ళీ దీనిసాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ప్రాంతాల్లో మెట్టపంటలను సకాలంలో విత్తలేకపోయారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆముదాన్ని సాగుచేసుకోవడం ఎంతో మేలు. ఈ పంటను జులై చివరి వరకూ విత్తుకోవడానికి సమయం ఉంది.
ఖరీఫ్ ఆముదాన్ని వర్షాధారంగా సాగుచేస్తారు. పంటకాలం 4-6నెలలుంటుంది. తొలకరి వర్షాలకు ఆముదాన్ని విత్తితే డిసెంబరు నెలవరకు ఆముదం పంట కొనసాగుతుంది. రెండు, మూడు నీటితడులిస్తే పంటకాలాన్ని మరింత పొడిగించే అవకాశం వుంది.
ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారత దేశానికి ఏటా 5వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించటం విశేషం. అయితే ఈ ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ప్రాంతాల్లో మెట్టపంటలను సకాలంలో విత్తలేకపోయారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ�