Home » Cattle Reproduction :
Cattle Farming : సాలుకు ఒక దూడ, ఏడాది పొడవునా పాల దిగుబడి అన్నసూత్రమే పాడిపరిశ్రమ అభివద్ధికి మూలం. అంటే పశుపోషణలో రైతులు లాభాలు పొందాలంటే ఏడాదికి ఒక దూడ పుట్టే విధంగా జాగ్రత్త తీసుకోవాలి.
యదను సకాలంలో గుర్తించి సరైన సమయంలో కృత్రిమ గర్భధారణ లేదా సహజ సంపర్కం చేయించాలి. ఇందుకోసం రైతులు యదలక్షణాలను గమనించాలి. యదకు వచ్చిన ఆవులు చిరాకుగా అటుఇటు తిరుగుతుంటాయి. ఇతర పశువుల మీద ఎక్కుతాయి. ఇతర పశువులు ఎక్కబోతే కదలకుండా ఉంటాయి.