Home » Chennai
మూడు రోజులవరకు ఈ నౌకలో ప్రయాణించవచ్చు. పుదుచ్చేరి మీదుగా చెన్నై నుంచి విశాఖ.. విశాఖ నుంచి చెన్నై ప్రయాణించే వీలుంది. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు నౌకలో గడపవచ్చు. 11 అంతస్థులు కలిగిన ఈ నౌకలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై శివారులోని పొజిచలూరులో ఒక ఇంట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి, అతని భార్య, ఇద్దరు పిల్లలు శనివారం ఉదయం అనుమానాస్పద స్ధితిలో మరణించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో గురువారం పర్యటించారు. డీఎమ్‌కే అధికారం చేపట్టి, స్టాలిన్ సీఎంగా గెలిచిన తర్వాత మోదీ చెన్నైలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా చెన్నైలో దాదాపు రూ.31,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.
Chennai Rave Party : చెన్నైలోని కోయంబేడు సమీపంలో మాల్లో రేవ్ పార్టీ కలకలం రేపింది. విదేశీ మద్యం తాగిన 23ఏళ్ల యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇంట్లో, చెన్నై విమానాశ్రయంలో బాంబు పెట్టామని బెదిరింపు ఫోన్ కాల్ చేసిన యువకుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.
చెన్నై బీచ్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. చెన్నైలోని బీచ్‌లలో ప్రముఖమైంది మెరీనా బీచ్. ఇక్కడికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుంటారు.
తమిళనాడులో ఘోరం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని టికెట్ తీసుకోమన్నందుకు ఆ వ్యక్తి కండక్టర్ పై దాడి చేశాడు. ఈ దాడిలో కండక్టర్ మరణించాడు.
రంజాన్ వేళ మద్యం తాగటానికి డబ్బులు లేకపోవటంతో అతిధిగా వెళ్లిన ఇంట్లో బిర్యానీతో పాటు బంగారం తినేసిన దొంగను చెన్నై పోలీసులు పట్టుకున్నారు.
తమిళనాడులోని చెన్నైలో లాకప్ డెత్‌లో చనిపోయిన విఘ్నేష్ ఒంటిపై 13 చోట్ల గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదికలో తేలింది.
చెన్నై ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న రోగుల్ని సురక్షితంగా కాపాడి మరో ఆస్పత్రికి తరలించారు.