Chennai : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

తమిళనాడు రాజధాని చెన్నైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై శివారులోని పొజిచలూరులో ఒక ఇంట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి, అతని భార్య, ఇద్దరు పిల్లలు శనివారం ఉదయం అనుమానాస్పద స్ధితిలో మరణించారు.

Chennai : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Chennai Family Suicide

Updated On : May 28, 2022 / 5:50 PM IST

Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై శివారులోని పొజిచలూరులో ఒక ఇంట్లో నివసిస్తున్న ఒక వ్యక్తి, అతని భార్య, ఇద్దరు పిల్లలు శనివారం ఉదయం అనుమానాస్పద స్ధితిలో మరణించారు.

ఇరుగు పొరుగు వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న పరిస్ధితిని చూస్తే… ఇంటి పెద్ద అయిన వ్యక్తి మొదట భార్యను, తర్వాత ఇద్దరు పిల్లలను చంపి చివరకు అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

వ్యాపారంలో కలిగిన ఆర్ధిక నష్టాలను భరించలేకే వ్యాపారి కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగు మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Nalgonda : రథానికి కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి