Nalgonda : రథానికి కరెంట్ తీగలు తగిలి ముగ్గురు మృతి
నల్గోండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలకు తరలించే క్రమంలో కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

Nalgonda : నల్గోండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. రామాలయానికి చెందిన రథాన్ని రథశాలకు తరలించే క్రమంలో కరెంట్ వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామ శివారులో ఉన్న రామాలయంలో ఇటీవల రాముల వారి ఉత్సవాల సందర్భంగా రథోత్సవం నిర్వహించారు. అనంతరం ఆ రధం దేవాలయం దగ్గరే ఉంచారు. రథం ఇనుముతో చేసినది కావటం వలన.. వర్షానికి తుప్పు పడుతుందనే భావనతో శనివారం ఆ రథాన్ని రథశాలకు తరలించేందుకు కొందరు ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో సమీపంలో రథాన్ని తీసుకు వెళుతుంటే రథం 11కేవీ విద్యుత్తు తీగలను తాకింది. దీంతో విద్యుదాఘాతంతో కేతపల్లికి చెందిన రాజబోయిన యాదయ్య (45), పొగాకు మోహన్(36), గుర్రంపూడ్ మండలం మక్కపల్లికి చెందిన దాసరి ఆంజనేయులు(26) అక్కడికక్కడే మరణించారు.
కేతపల్లికి చెందిన మరోవ్యక్తి రాజబోయిన వెంకటయ్యకు తీవ్రగాయాలు కావడంతో అతడిని 108 అంబులెన్స్ లో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై రజనీకర్ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read : Kolkata : స్నేహితురాలి మరణంతో ఆత్మహత్య చేసుకున్న మోడల్..తల్లి షాకింగ్ కామెంట్స్
- కరెంట్ షాక్‌తో 11మంది మృతి
- Honour Killing : హోంగార్డు రామకృష్ణ మృతదేహానికి నేడు పోస్టుమార్టం
- Honour Killing : భువనగిరి పరువు హత్యకేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Nalgonda : ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం…ప్రియుడు గల్లంతు
- NS Left Canal Car Case : నల్గొండ కారు కేసు-మానసిక స్ధితి సరిగా లేదు..!
1Rakhi Sawant : నేనెలాంటి బట్టలు వేసుకోవాలో నా ప్రియుడే డిసైడ్ చేస్తాడు..
2Ammavodi: వరుసగా మూడో ఏడాది అమ్మఒడి అందుకుంటున్న శ్రీకాకుళం
3Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
4Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు
5Intermediate Results: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
6Jack Sparrow : జానీడెప్ కి సారీ చెప్పి 2300 కోట్ల డీల్‌ని ఆఫర్ చేసిన డిస్ని??
7Hallmark: పాత గోల్డ్‌కు కొత్త హాల్ మార్క్
8Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
9Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
10Amma Vodi : నేడే ఖాతాల్లోకి డబ్బులు.. వీరందరికి అమ్మఒడి కట్..!
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!
-
CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
-
Birch Tree : రావి చెట్టు క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుందా?