Home » Covishield vaccine
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌కు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ సంస్థకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుమార్తె మరణానికి కారణమయ్యారంటూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.
కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ షాట్స్ అందుబాటులోకి రానుండటానికి ఒక రోజు ముందుగానే భారీగా ధర తగ్గిపోయింది. సగం కంటే తక్కువగా అంటే రూ.600 నుంచి రూ.225కి పడిపోయింది వ్యాక్సిన్ ధర.
కొవీషీల్డ్ వ్యాక్సిన్ పూర్తి డోస్ తీసుకున్న వారిలో ఏడు నెలలకే 90శాతం యాంటీబాడీలు జనరేట్ అవుతాయని అంటున్నారు. 500కు పైగా హెల్త్ వర్కర్లలో ఈ విషయం నిరూపితమైందని చెబుతున్నారు.
కొవిడ్ వ్యాక్సిన్ ఏది మంచిది? రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలా? ఒక డోసు ఒక టీకా.. మరో డోసు ఇంకో టీకా వేసుకోవచ్చా? ప్రతిఒక్కరిలోనూ ఇలాంటి అనుమానాలే ఉన్నాయి.
కరోనా వేరియంట్లపై కొవాగ్జిన్, కొవిషిల్డ్ వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ (డిజి) డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని చెప్పారు.
కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ విరామ కాలంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కోవిషీల్డ్ విరామ కాలంలో ఎలాంటి తక్షణ మార్పులు లేవని పేర్కొంది. బ్యాలన్స్ చేయాలన్నది మాత్రమే ఉద్దేశమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.
తెలంగాణలో వ్యాక్సినేషన్‌కు మరోసారి బ్రెక్ పడింది. కొవిషీల్డ్ తొలి, రెండో డోస్ మధ్య వ్యవధిలో కేంద్రం ప్రభుత్వం మార్పులు చేయడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా నుంచి కోలుకున్నవారికి ఆరు నెలల తర్వాతే వ్యాక్సిన్ తీసుకునేందుకు వీలుంటుంది. అలాగే కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ 12-16 వారాలకు పెంచాలని నిపుణుల ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
రాష్ట్రంలో కొవిడ్ టీకా కొరత నెలకొన్న వేళ మరో 1.92 లక్షల కొవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకాలు గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరాయి. వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.