Home » crowd of devotees
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఈ మేరకు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
సొంత వాహనాలు, ఇతర వాహనాల్లో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో అలిపిరి వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. తనిఖీలు ఆలస్యం అవుతుండడంతో భక్తులు గంటల పాటు వెయిట్ చేయాల్సివస్తోంది.