Home » Deccan Mall Fire Accident
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, ఫైర్ సేఫ్టీ వింగ్ అధికారులు, సిబ్బంది శిథిలాలు తొలగించే పనిలో ఉన్నారు.
సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో ఓ మృతదేహం లభ్యమైంది. ఇంకా ఇద్దరి ఆచూకీ దొరకాల్సి ఉంది. మరోవైపు భవనంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తుల ఆచూకీ దొరక్కపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. బిల్డింగ్ నుంచి వేడి సెగలు వెలువడుతుండటంతో పాటు పొగలు కమ్మేయడంతో భవనం లోపలికి క్లూస్ టీమ్ వెళ్ల లేకపోతోంది.(Secunderabad Fire Accident)
సికింద్రాబాద్ డెక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు కూలీలు సజీవదహనం అయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన ముగ్గురు యువకుల మొబైల్ లొకేషన్ ప్రమాదం జరిగిన భవనంలోనే చూపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.