Home » DH Srinivasa Rao
నాలుగు, ఐదు వారాలుగా కేసులు పెరుగుతున్నాయని, ప్రత్యేకంగా రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ వల్ల కరోనా పాజిటివ్ కేసులను తగ్గించవచ్చని చెప్పారు.
తెలంగాణలో సెకండ్ వేవ్ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే కరోనా విషయంలో ప్రభుత్వ, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం బయటపడింది.
రేపు తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు సెలవు ఉంటుందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం యథావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.