Home » electric pole
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైల్వేస్టేషన్లో విద్యుత్ఘాతంతో సాక్షి అహూజా అనే మహిళ మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బెంగళూరు నగరంలో ఒక యువతి విద్యుత్ షాక్కు గురై మరణించింది. అఖిల అనే యువతి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా, అదుపుతప్పి కింద పడబోయింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకోగా షాక్ తగిలి, ప్రాణాలు కోల్పోయింది.
వృద్ధుడిని కుటుంబ సభ్యులే కొట్టి చంపిన ఘటన ఒడిశాలో జరిగింది. చిన్న వివాదం కారణంగా వృద్ధుడిని అతడి కొడుకు, కోడలు, సోదరుడు కలిసి స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టి చంపారు.
విద్యుత్ శాఖా మంత్రిగా పనిచేస్తున్న ప్రద్యుమ్నసింగ్ తోమర్ తన విచిత్ర విన్యాసాలతో మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఏకంగా నిచ్చెన వేసుకుని ఆయనే స్వయంగా కరెంట్ పోల్ ఎక్కి మరమత్తులు చేయటానికి యత్నించి ఉన్న కరెంట్ కూడా పోయేలా చేశారు.