Home » Fenugreek Seeds
3,000 సంవత్సరాల క్రితమే భారతీయ వంటకాల్లో మెంతికూర ప్రసిద్ధి చెందిందని నమ్ముతారు. సాంప్రదాయకంగా మెంతి గింజలను సువాసన లేదా ఆహారం కోసం ఉపయోగించడమే కాకుండా పశువుల దాణాలో కూడా ఉపయోగిస్తూ వస్తున్నారు.
వెంట్రుకల చివర్లు చిట్లకుండా ఆరోగ్యంగా పెరిగేందుకు మెంతులు నానబెట్టిన నీటితో జుట్టు తడిపి, ఆ తర్వాత నానబెట్టిన మెంతిపిండిలో కాస్త పెరుగు చేర్చి తలకు ప్యాక్‌గా వేసుకోవాలి. వీటిల్లోని పొటాషియం జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
మెంతులు, తేనె, నిమ్మరసం కలిపి కషాయంలా తాగితే జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
జుట్టు కుదుళ్లను బలోపేతం చేయటంలో మెంతులు సహాయపడతాయి. మెంతులు జుట్టుకు మెరుపునిస్తాయి మరియు మృదువుగా చేస్తాయి. చలికాలంలో వచ్చే చుండ్రుపై ప్రభావవవంతంగా పనిచేసే సహజ ఔషధాల్లో మెంతులు ముఖ్యమైనవి.