Home » gang arrested
వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్(ఈడీ) రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎమ్మెల్యే కేసు నమోదు చేశారు. 16.8 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
హైదరాబాద్ లో వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటాను ఈ ముఠా చోరీ చేశారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలు కొట్టేసి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు.
దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం ఈ ముఠా నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను కూడా విక్రయిస్తున్నారు. నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.