Home » Gurmeet Ram Rahim Singh
డేరా బాబాగా పేరు పొందిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు తాజాగా మరోసారి బెయిల్ లభించింది. ఈ సారి ఆయన 40 రోజులు పెరోల్‌పై విడుదల కానున్నారు. ఈ ఏడాది ఇలా పెరోల్‌పై విడుదల కావడం ఇది మూడోసారి.
డేరా సచ్చా సౌదా ఆశ్రమం నిర్వహిస్తున్న డేరా బాబా.. తన ఆశ్రమంలోని ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. దీంతో 2017 నుంచి హరియాణాలోని రోహ్తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.