Home » HICC NOVATEL
75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8-22 వరకు ఈ వేడుకలు జరుగుతాయి.
హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ అంశాలు కూడా చర్చకు వస్తాయని, ఈ సమావేశాల ద్వారా తెలంగాణ ప్రజలకు మేమున్నాం అని భరోసా కల్పిస్తామని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.
జూలై 2,3 తేదీల్లో నగరంలోని నోవాటెల్ హోటల్లో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతోపాటు, బీజేపీకి చెందిన జాతీయ స్థాయి కీలక నేతలు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ వంటలను రుచి చూపించాలని నిర్ణయించారు.
మోదీతోపాటు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ముఖ్య నేతలు వస్తుండటంతో నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఐదు వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. మోదీ పర్యటనలో ఉన్నంత వరకు ఆయనకు మూడంచెల భద్రత ఉంటుంది.