Home » IND vs AUS ODI Series
IND vs AUS 1st ODI: ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి వన్డే జరుగుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేశారు.
వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని టీమిండియా గొప్పగా ప్రారంభించింది. రెండు సిరీస్‌లలోనూ న్యూజిలాండ్, శ్రీలంకతో ఆడిన ఆరు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.
ఇండియా వర్సెస్ ఆసీస్ జట్ల మధ్య మార్చి 17 నుంచి జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 16 మంది సభ్యులతో కూడిన టీంను ప్రకటించింది. జట్టు కెప్టెన్‌గా పాట్ కమిన్స్ కొనసాగనున్నాడు. ఇన్నాళ్లు గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న ఆల్ రౌండ�