Home » Intercropping In Coconut
మెట్ట ప్రాంతాలలో వర్షాధారంగా పంటలు సాగుచేసే రైతులు ఒకే పంటపై ఆదారపడకుండా అంతర పంటలు సాగుచేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే అంతర పంటల వల్ల సహజ వనరులను ఉపయోగించుకోవడంలో ఎక్కువ, తక్కువలను గమనించాలి.
తన మూడున్నర ఎకరాల కొబ్బరితోటలో ప్రతి సీజన్ లో అంతర పంటలు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతుంటారు. ప్రస్తుతం సొర, దోసతో పాటు మినుము సాగుచేశారు. మరికొద్దిరోజుల్లో మినుము పంట చేతికి రానుండగా.. ఇప్పుడిప్పుడే పూత, కాత దశలో సొర, దోస పంటలున్నాయి.