Home » isro live
ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్ రోవర్ చంద్రయాన్-3లో ఉన్నాయని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
చంద్రయాన్ -3ని భూమి చుట్టూఉన్న 170 X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెడుతుంది. అది 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది. క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ విన్యాసాలను ట్రాన్స్లూనాల్ ఇంజెక్షన్స్ (టీఎల్ఐ)గా పేర్కొంటారు