Home » IT Raids On Minister Malla Reddy
మంత్రి మల్లారెడ్డిపై ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా రెండో రోజూ ఐటీ సోదాలు కంటిన్యూ అయ్యాయి. రెండు రోజుల్లో ఏకంగా రూ.8కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రి మల్లారెడ్డి సమీప బంధవు నివాసంలో దాడులు చేపట్టిన ఐటీ అధికారులు రూ.2 కోట్ల నగదు సీజ్ చేశారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలోనూ రూ.2 కోట్లు సీజ్ చేశారు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దర్యాఫ్తులో కొత్త కోణం వెలుగుచూసింది. క్యాసినోలో పెట్టుబడులు పెట్టిన జైకిషన్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు.