Home » Kahramanmaras
టర్కీలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. పెను భూకంప టర్కీని కుదిపేసింది. తెల్లవారుజాము 4:17 గంటలకు భూకంపం సంభవించింది. దీంతో పలు భవనాలు కుప్పకూలాయి. ఈ విలయంలో ఇప్పటికే 200 మందికిపైగా మరణించారు.
సోమవారం వేకువఝామున నాలుగు గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. టర్కీలోని దియర్బకిర్, అదానా, గాజియాంటెప్ ప్రాంతాల్లో, సిరియాలోని అలెప్పో, లతాకియా, హామా, టార్టస్ ప్రాంతాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది.
భూకంపం తీవ్రతకు టర్కీ, సిరియాలో పెనునష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. భారీ భూకంపం తర్వాత ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల్లో భూకంపం దా�