Home » Karnataka devotees
శ్రీశైలం ఘర్షణలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఐదు గంటల సేపు ఘర్షణ చోటు చేసుకుంది. కోటికి పైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.
షాపు యజమానులపై దౌర్జన్యం చేశారు. షాపు యజమానులపై కన్నడిగులు కర్రలతో చితకబాదారు. షాపులలోని వస్తువులను పగులగొట్టి రోడ్లపై విసిరి నిప్పంటించారు.
టీ స్టాల్ దగ్గర కన్నడ భక్తుడికి, టీ స్టాల్ యజమానికి మధ్య గొడవ జరిగింది. టీ స్టాల్ యజమాని కన్నడిగుడిపై దాడి చేయడంతో ఘర్షణ చెలరేగింది.