Home » Madhya Pradesh road accident
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆగిఉన్న మూడు బస్సులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 39 మందికి గాయాలయ్యాయి. అమిత్ షా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని వస్తుంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ రోడ్డుప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడినవారికి రూ.50,000 ఆర్థిక సహాయంగా ప్రకటించారు.