Home » manipur government
మణిపూర్లో మే 4న ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేయడంపై మణిపూర్ పోలీసులను సుప్రీంకోర్టు నిలదీసింది. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింస భయంకరమైందని తెలిపింది.
మణిపూర్ వీడియో ఘటనకు సంబంధించి ఒక బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు ముందు తన భర్తను, కొడుకును దారుణంగా హతమార్చిన విషయం ప్రస్తావించారు. తన కుటుంబ భవిష్యత్ ఏంటో అర్ధం కావట్లేదని తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ దారుణ ఘటనపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ ఈశాన్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లకు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింద�