Home » Manoj Muntashir
ప్రభాస్ (Prabhas) రాముడిగా, కృతి సనన్ (Kriti Sanon)సీతగా నటించిన చిత్రం ఆది పురుష్(Adipurush). ఈ చిత్రానికి మాటలు రాసిన రచయిత మనోజ్ ముంతాషిర్ బేషరతుగా క్షమాపణలు కోరారు. తాను తప్పు చేసినట్లు అంగీకరించారు.
రైటర్ మనోజ్ ముంతషీర్ అయితే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఏదో ఒక వ్యాఖ్యలు చేసి వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మనోజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ట్రోలింగ్, దేశవ్యాప్తంగా విమర్శలు ఎక్కువవడంతో ఆదిపురుష్ చిత్రయూనిట్ దిగి వచ్చి కొన్ని డైలాగ్స్ ని మార్చడానికి ఓకే చెప్పింది. అయితే దీనిని కూడా తనకు సపోర్ట్ గా మార్చుకుంటూ తన తప్పేమి లేదంటూనే డైలాగ్స్ మారుస్తామంటూ మనోజ్ ట్వీట్ చేశాడు.
సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ పై వివాదం చెలరేగుతుంది. పైగా దీన్ని ఆదిపురుష్ సినిమా రైటర్ మనోజ్ ముంతషీర్ సమర్ధించుకోవడంతో అతనిపై మరింత ఫైర్ అవుతున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియా అంతా ఆదిపురుష్ పై ట్రోల్స్ తోనే నిండిపోయింది.
ఈ సినిమాలో ఆంజనేయస్వామి క్యారెక్టర్ తో మాట్లాడించిన మాటలు, వేరే వాళ్ళు హనుమంతుడితో మాట్లాడిన మాటలు కొన్ని తప్పుగా ఉన్నాయని, మాట్లాడే విధానం, డైలాగ్స్ కూడా తప్పుగా ఉన్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై పెద్ద వివాదమే చెలరేగుతుంది.