Home » millets rice calories
గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు, ప్రధాన ఆహారమైన జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు.. కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా కనుమరుగైపోయాయి. ఆధునిక పోకడలతో ప్రజల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ మిల్లెట్ ఆధారిత బియ్యాన్ని తయారు చేస్తోంది. ఇప్పటికే మిల్లెట్ దోస, ఇడ్లీ, పాస్తా, బిస్కెట్ లకు తీసుకొచ్చిన ఈ సంస్థ మరో రెండు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి మిల్లెట్ బియ్యాన్ని తీసుకొస్తుంది.