Home » Monsoon Diet
వర్షాకాలంలో ఆకు కూరలు విరివిగా పండుతాయి. కానీ ఈ సీజన్లో వీటిని తినకుండా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు. కంటి కనిపించని సూక్ష్మజీవులు వీటిపై చేరడం వల్ల అవి తింటే అనేక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
చేపలకు వర్షాకాలం సంతానోత్పత్తి సమయం. అందుకే వాటి శరీరం చాలా మార్పులకు లోనవుతుంది. అంతేకాదు, శైవలాలు, బాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు వాటి శరీరానికి అంటుకుంటాయి. ఇలాంటి చేపలు తింటే ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
వర్షాకాలంలో ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నూనెతో కూడిన స్పైసీ ఫుడ్స్ తినకుండా ఉండటం మంచిది.
నెయ్యిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం, జింక్ మరియు ఐరన్ వంటి ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో ఆరోగ్యకరమైన ఎముకలు, చర్మం , జుట్టును ప్రోత్సహించడంలో సహాయపడతాయి.