Home » Mud Bath
రోడ్లు బాగు చేయాలంటూ ఎమ్మెల్యే ముందు వినూత్న నిరసనకు దిగాడో వ్యక్తి. రోడ్డుపై ఉన్న బురద నీటిలోనే స్నానం చేశాడు. అక్కడే యోగా కూడా చేశాడు. ఈ తతంగాన్ని కొందరు వీడియో తీశారు. ఇప్పుడా వీడియో వైరల్గా మారింది.
ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్గంజ్లో బీజేపీ ఎమ్మెల్యే జైమంగళ్ కనోజియాను బురదతో ముంచేశారు. ఎమ్మెల్యేతో పాటు నగర పాలిక ఛైర్మన్ కృష్ణ గోపాల్ జైస్వాల్ కు కూడా ఇదే గౌరవం దక్కింది. ఇదంతా జరుగుతున్న సమయంలో మహిళలంతా ఆనందంతో పాటలు పాడారు.