Home » NDPP
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 27న జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల ప్ర్రక్రియ గత వారమే మొదలైంది. మంగళవారమే నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. అయితే, సోమవారం వరకు అక్కడ దాఖలైన నామినేషన్లు ఆరు మాత్రమే.
నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ఇక్కడ బీజేపీ-ఎన్డీపీపీ కూటమి కలిసి పోటీ చేయనుంది. ఈ నేపథ్యలో ఇరు పార్టీలు 40:60 నిష్పత్తిలో సీట్లు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు నాగాలాండ్ అసెంబ్లీకి బీజేపీ 20 స్థానాల్లో పోటీ పడనుంది.