Home » New District Courts
వ్యవస్థలను చక్కబెట్టుకోలేని వారు కోర్టులను తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. పరిధి దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై రాజ్యాంగపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇటీవల కోర్టు తీర్పులపై కొందరు వక్ర భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. తీర్పులను తప్పుపట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమన్నారు.
తెలంగాణకు సంబంధించి న్యాయవ్యవస్థ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఈ నెల 2 నుంచి 23 కొత్త జిల్లాల్లో ఏర్పాటైన కోర్టుల్లో సేవలు ప్రారంభమవుతాయి. ఒకేసారి 23 కోర్టుల సేవలు ప్రారంభం కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే మొదటిసారి.