Home » Papaya Pests and Diseases
బొప్పాయిలో పోషకాలు అధికంగా వుండటంతో నానాటికీ వినియోగం పెరుగుతోంది. దీంతో పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా వుంది. అధిక విస్తీర్ణంలో సాగుకు మొగ్గుచూపుతున్నారు . ఆగష్టులో మొక్కలు నాటేందుకు కొంతమంది రైతులు నారు మొక్కలు పెంచుతున్నారు.
ముఖ్యంగా రసంపీల్చు పురుగుల దాడి వల్ల వైరస్ తెగుళ్ల వ్యాప్తిచెందుతున్నాయి. బొప్పాయి పంట చివరిదశ వరకు రైతును వెన్నాడుతున్న సమస్య పిండినల్లి. ఇది ఒక్క బొప్పాయిలోనే కాకుండా , కూరగాయలు, పండ్ల తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది.
ఈ తెగులు సోకితే నల్లటి ఉబ్బెత్తుగా ఉన్న మచ్చలు ఏర్పడుతాయి. కాయలు పక్వానికి రావు. నివారణకు లీటర్ నీటిలో మంకోజెట్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలామిన్ రెండు గ్రాముల మందును కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.