2021 సంవత్సరం మొత్తం చైనా వాస్తవాధీన రేఖ వెంట బలగాల మోహరింపులు, నిర్మాణాలను కొనసాగించిందని పెంటగాన్ పేర్కొంది. చర్చల్లో పురోగతి నిధానంగా ఉందని అభిప్రాయ పడింది. ఇరు పక్షాలు ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదని తెలిపింది.
జిత్తులమారి చైనా బుద్ధి మారలేదు. భారత్ సరిహద్దుల్లో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గ్రామాలను చైనా కట్టేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో అక్రమంగా చైనా నిర్మించిన రెండవ గ్రామం ఇదే.
చైనా సైనిక ఆధునీకరణ విస్తృతంగా కొనసాగుతోంది. చైనా తన అణుశక్తిని చాలా వేగంగా విస్తరిస్తున్నట్లు సమాచారం. ఒక సంవత్సరం క్రితం అమెరికా అధికారులు అంచనా వేసినదానికంటే