Home » pig kidney
అమెరికాలో 62ఏళ్ల వ్యక్తికి జన్యుపరంగా అభివృద్ధిచేసిన పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. దాదాపు 4 గంటల పాటు ఆపరేషన్ అనంతరం పంది కిడ్నీని అతడికి అమర్చారు. ప్రపంచంలోనే పంది కిడ్నీని అమర్చిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
రోగికి అమర్చిన అవయవాన్ని తిరస్కరించే సంకేతాలు మాకు కనిపించలేదు. అయితే, గతంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని వైద్యులు తెలిపారు.
అవయవాలకు కొరత ఏర్పడిన పరిస్థితుల్లో సక్సెస్ అయిన ఆపరేషన్.. కొత్త వైద్య అధ్యాయానికి దారితీయొచ్చని డాక్టర్లు అంటున్నారు.
జంతువుల అవయవాలతో మనుషుల ప్రాణాలు కాపాడే ప్రయోగంలో ముందడుగేశారు సైంటిస్టులు. పంది కిడ్నీని మానవ శరీరానికి తాత్కాలికంగా ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు.